Crossing the Blues, University of the Nations, Social Work and Education

Fight Against Tobacco

Crossing the Blues, University of the Nations, Social Work and Education, Shop Clothes Online, Radiology Information Social Work and Education

 పొగాకును జయిద్దాం
కొందరికి
అదే జీవితం... ఎన్ని హెచ్చరికలున్నా, ఎంత డబ్బు ఖర్చయినా దాన్ని మానలేరు. మానేద్దామనుకున్నావీలుకాని పరిస్థితి. నరకకూపమే పొగాకు. ప్రతిరోజూ కొత్తగా కూపంలోకి దిగేవారి సంఖ్య ఎక్కువే. చిన్నవయసులో స్టయిల్ కోసమో, సహచరుల ప్రభావం వల్లనో సరదాగా మొదలయ్యే అలవాటు చివరికి వ్యసనమైజీవితాన్నే హరించివేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే నెల 31 తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేకదినంగా గుర్తించింది. సందర్భంగా పొగాకును ఎలా జయించొచ్చో చూద్దాం.
ప్రపంచ
ఆరోగ్య సంస్థం గణాంకాల ప్రకారం ప్రతి ఏటా పొగాకు వాడకం వల్ల 60 లక్షల మంది మృత్యువాతపడుతున్నారు. అంటే దాదాపుగా ప్రతి ఆరు సెకన్ల కాలంలో ఒకరు ప్రాణాలు విడుస్తున్నారు. వీరంతా ప్రత్యక్షంగాపొగాకు వ్యసనానికి బానిసలైనవారే. పరోక్షంగా పొగ పీల్చేవారూ సమానంగా నష్టపోతున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు ఎక్కువమంది. పీల్చే ప్రతి సిగరెట్టు సదరు మనిషి జీవిత కాలం నుంచి ఏడు నిమిషాల్ని హరించివేస్తుంది. 20 శతాబ్దంలో పొగ తాగడం వల్ల పదికోట్ల మరణాలు సంభవించాయి. రీతిలో 21 శతాబ్దంలో వందకోట్లమరణాలు సంభవించగలవని అంచనా!

ఎన్ని
రసాయనాలో!
పొగాకు
రూపాలన్నీ అనర్థాలకు దారితీస్తాయి. పొగాకు కు నిప్పంటించి పీల్చే పొగలో నాలుగు వేల రకాలరసాయనాలు ఉన్నట్లు శాస్త్ర పరంగా మనకు తెలుస్తోంది. రసాయనాల్లో కనీసం అరవై రకాల రసాయనాలుఊపిరితిత్తులకు క్యాన్సర్ను కలుగజేస్తాయి.
పొగాకు
నమలడం వల్ల పెదాలు, నాలుక, బుగ్గల లోపలి భాగం లాంటి అవయవాలకు క్యాన్సర్ సోకుతుంది. పెయింట్స్ట్రిప్పర్లలో వాడే అసిటోన్, నేల శుభ్రం చేసేందుకు వాడే అమోనియా, చీమల మందులో వాడే ఆర్సెనిక్, సిగరెట్లైటర్లో ఉండే బ్యూటేన్, కారు బ్యాటరీల్లో ఉపయోగించే క్యాడ్మియమ్... ఇంకా కార్బన్ మోనాక్సైడ్, మిథనాల్, వినైల్క్లోరైడ్ లాంటి హానికర రసాయనాలెన్నో సిగరెట్ పొగలో ఉన్నాయి. సిగరెట్ తాగడం వల్ల సంభవించే అనారోగ్యాల్లోమొదటిది ఊపిరితిత్తుల క్యాన్సర్. 90 శాతం ఊపితిత్తుల క్యాన్సర్లు సిగరెట్ కారణంగానే సంభవిస్తున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధులైన సిఓపిడితో బాధపడేవారిలో 75 శాతం పొగరాయుళ్లే. ‌ ‌
పొగ
- అనర్థాలు
పొగాకు
వల్ల మన శరీరంలో దుష్ప్రభావం పడని అవయవమంటూ లేదు. మెదడు నరాలపై ప్రభావం చూపించడం వల్లపక్షవాతం, టొబాకో డిపెండెన్స్, ఆంగ్జయిటీ సైకోసిస్ వస్తాయి. శుక్లాలు త్వరగా ఏర్పడ తాయి. వాసన చూడగలిగేలక్షణం తగ్గుతుంది. పెదవి, నాలుక, స్వరపేటిక, లాంటి అవయవాలకు క్యాన్సర్ రావచ్చు. గొంతునొప్పి, చిగుళ్లవ్యాధులు వస్తాయి. ఆస్తమా, న్యుమోనియాలే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్కి దారితీస్తుంది. గుండె రక్తనాళాల్లోపూడికలు, గుండెపోట్లు, జీర్ణకోశ వ్యాధులు, పేగు క్యాన్సర్ వస్తాయి. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం, బలహీనత, స్త్రీలలో రుతుసమస్యలు, సంతానరాహిత్యం వంటి సమస్యలు ఎదురవుతాయి. గాయాలుమానకపోవడం, రక్తక్యాన్సర్ కూడా రావచ్చు. ఇలా ఇంకా ఎన్నో జబ్బులున్నాయి.
పొగ
తాగడం మానేశాక
ఒకరోజులో
- గుండె, రక్తపోటు కుదుటపడతాయి.
ఒక
సంవత్సరం తరువాత - గుండెజబ్బు సోకే తత్వం 50 శాతం తగ్గిపోతుంది.
5-15 ఏళ్ల తరువాత - పక్షవాతం సోకే అవకాశాలు తగ్గిపోతాయి.
10 సంవత్సరాల తరువాత - ఊపిరితిత్తుల క్యాన్సర్ అవకాశం తగ్గుతుంది.
ఇలా
మానొచ్చు
* పొగాకు మానేయాలనుకున్నా, మానేయలేకపోవడం చాలా తరచుగా ఎదురయ్యే సమస్య. దీనికిపరిష్కారాలున్నాయి. అన్నింటికన్నా ముందు వ్యక్తి దృఢనిర్ణయం. ఇది లేనిదే ఎటువంటి వైద్య సహాయం కూడాముందుకు సాగదు. ఇందుకోసం ఇలా చేయండి.

*
మీరు మానేయాలనుకుంటున్నారని పదిమందిలో చెప్పండి.
* నెమ్మదిగా మానేద్దాంలే అనుకోవడం పొరపాటు.
* సిగరెట్ మానేశాక సంభవించే మార్పులలో కొన్ని ఆరోగ్యంలో ఒడిదుడుకులను కలిగించవచ్చు. అటువంటిసమయంలో తాత్కాలికంగా నికోటిన్ ప్యాచ్, గమ్ వంటివి ఉపయోగించవ చ్చు.

*
మీకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మీలాగా ఎదుర్కొనే మరొకరితో పంచుకోండి.

-
డాక్టర్ కృష్ణమోహన్,
కన్సల్టెంట్
మెడికల్ అంకాలజిస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్,
హెల్ప్
లైన్ : 99895 24365

Blog Archive